మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
       


Sri Dakshinamurthy Navaratna Mala Stotram – శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రమ్

మూలేవటస్య మునిపుంగవసేవ్యమానం
ముద్రావిశేషముకుళీకృతపాణిపద్మమ్ |
మందస్మితం మధురవేషముదారమాద్యం
తేజస్తదస్తు హృదయే తరుణేందుచూడమ్ || 1 ||

శాంతం శారదచంద్రకాంతిధవళం చంద్రాభిరామాననం
చంద్రార్కోపమకాంతికుండలధరం చంద్రావదాతాంశుకమ్ |
వీణాం పుస్తకమక్షసూత్రవలయం వ్యాఖ్యానముద్రాం కరై-
ర్బిభ్రాణం కలయే హృదా మమ సదా శాస్తారమిష్టార్థదమ్ || 2 ||

కర్పూరగాత్రమరవిందదళాయతాక్షం
కర్పూరశీతలహృదం కరుణావిలాసమ్ |
చంద్రార్ధశేఖరమనంతగుణాభిరామ-
మింద్రాదిసేవ్యపదపంకజమీశమీడే || 3 ||

ద్యుద్రోరధస్స్వర్ణమయాసనస్థం
ముద్రోల్లసద్బాహుముదారకాయమ్ |
సద్రోహిణీనాథకళావతంసం
భద్రోదధిం కంచన చింతయామః || 4 ||

ఉద్యద్భాస్కరసన్నిభం త్రిణయనం శ్వేతాంగరాగప్రభం
బాలం మౌంజిధరం ప్రసన్నవదనం న్యగ్రోధమూలేస్థితమ్ |
పింగాక్షం మృగశాబకస్థితికరం సుబ్రహ్మసూత్రాకృతీం
భక్తానామభయప్రదం భయహరం శ్రీదక్షిణామూర్తికమ్ || 5 ||

శ్రీకాంత ద్రుహిణోపమన్యు తపన స్కందేంద్ర నంద్యాదయః
ప్రాచీనాగురవోఽపి యస్య కరుణాలేశాద్గతాగౌరవమ్ |
తం సర్వాదిగురుం మనోజ్ఞవపుషం మందస్మితాలంకృతం
చిన్ముద్రాకృతిముగ్ధపాణినళినం చిత్తం శివం కుర్మహే || 6 ||

కపర్దినం చంద్రకళావతంసం
త్రిణేత్రమిందు ప్రతిమాక్షితాజ్వలమ్ |
చతుర్భుజం జ్ఞానదమక్షసూత్ర-
పుస్తాగ్నిహస్తం హృది భావయేచ్ఛివమ్ || 7 ||

వామోరూపరిసంస్థితాం గిరిసుతామన్యోన్యమాలింగితాం
శ్యామాముత్పలధారిణీం శశినిభాం చాలోకయంతం శివమ్ |
ఆశ్లిష్టేన కరేణ పుస్తకమథో కుంభం సుధాపూరితం
ముద్రాం జ్ఞానమయీం దధానమపరైర్ముక్తాక్షమాలం భజే || 8 ||

వటతరు నికటనివాసం పటుతర విజ్ఞాన ముద్రిత కరాబ్జమ్ |
కంచన దేశికమాద్యం కైవల్యానందకందళం వందే || 9 ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి నవరత్నమాలా స్తోత్రం |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.